News March 1, 2025
ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.
Similar News
News October 31, 2025
మన్యం జిల్లాలోకి మెంటాడ?

మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఒక నియోజకవర్గం.. ఒకే డివిజన్‌లో ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గం మన్యం జిల్లాలో ఉన్నప్పటికీ.. మెంటాడ మాత్రం VZM(D) బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌లో ఉంది. ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం మెంటాడ మండలం మన్యం జిల్లాలో కలిసే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మండల వాసులు వ్యతిరేకిస్తున్నారు.
News October 31, 2025
వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో?

పీసీసీ సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయాలని భావిస్తున్న తరుణంలో వనపర్తి జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని కాంగ్రెస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లక్కాకుల సతీశ్, రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, తిరుపతయ్య (బీసీ), వెంకటేష్ (ఎస్సీ), ఒక ఎస్టీ మహిళ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈసారి అదృష్టం ఎవరికి దక్కుతుందోనని చర్చ జరుగుతోంది.
News October 31, 2025
NTR: డిగ్రీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన బీఏ, బీకామ్, బీబీఏ 1,2,4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 770 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.


