News May 16, 2024
ములుగు: KF లైట్ బీరులో నీళ్లు

KF లైట్ బీర్‌లో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా.. ఈ నెల 14న ములుగు మండలంలోని ఓ వైన్స్‌లో 6 బీర్లు కొనగా, వాటిలో 5 బీర్లలో ఆల్కహాల్‌కు బదులు నీళ్లున్నట్లు గుర్తించాడు. దీంతో ఎక్సైజ్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బీర్ బాటిల్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, నిర్ధారణ అయితే వైన్‌షాపుపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు యువకుడు తెలిపాడు.
Similar News
News April 24, 2025
పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల స్నాతకోత్సవం

పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై మెడికల్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి, డైరక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.
News April 24, 2025
ఎల్కతుర్తి సభ ఏర్పాట్లపై సీపీతో సమావేశం

ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్‌తో సభ ఏర్పాట్లపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్చించారు. సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యల గురించి రూట్ మ్యాప్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్‌తో సమావేశం అయ్యారు.
News April 24, 2025
హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

HNK ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం.. హసన్‌పర్తి(M) కోమటిపల్లికి చెందిన అభిషేక్(18) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, కారులో స్నేహితులతో బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అభిషేక్ స్పాట్‌లోనే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.