News January 28, 2025
ములుగు: ‘MLA సీతక్క’ స్టిక్కర్‌తో పేరుతో వాహనం కలకలం

ములుగు ఎమ్మెల్యే, సీతక్క పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని ఓ వాహనం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు రవి ములుగు ఎస్ఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. అయితే అదే వాహనంలో బీజేపీ కండువా సైతం ఉండటంతో ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎక్కడైనా వాహనం కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రవి కోరారు.
Similar News
News December 12, 2025
HEADLINES

* తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
* హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు.. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
* రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM CBN
* ట్రంప్‌కు PM మోదీ ఫోన్.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
* పనితీరు మారాలంటూ TBJP ఎంపీలకు PM మోదీ హితబోధ
* సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఓటమి
News December 12, 2025
సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం: లోకేశ్

‘అఖండ-2’లో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులను కనువిందు చేయనుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. ఈ మూవీ అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నా. 5 దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న మామయ్యకు అభినందనలు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రేపు విడుదల కానుండగా, ఇప్పటికే ప్రీమియర్స్ మొదలయ్యాయి.
News December 12, 2025
KNR: చలి మంట కాగుతూ సిబ్బందితో సేదతీరిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం చలి తీవ్రత దృష్ట్యా కొద్దిసేపు సేదతీరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ, చలి మంట కాగుతూ ఆయన సిబ్బందితో కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.


