News April 10, 2025
ములుగు: UPDATE.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని హత్య

ములుగు జిల్లా వాజేడు మండలంలో <<16046948>>దారుణ హత్య జరిగిన విషయం<<>> తెలిసిందే. సీఐ కుమార్ తెలిపిన వివరాలు.. టేకులగూడెంకు చెందిన బుల్లబ్బాయి మద్యానికి డబ్బు ఇవ్వాలని తన అన్న విజయబాబును అడిగాడు. తన వద్ద లేవని చెప్పడంతో కోపంతో పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేసి హత మార్చాడు. విజయబాబు చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News November 27, 2025
ఆల్టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.
News November 27, 2025
పార్టీలకు అస్త్రంగా మారిన గుంపుల చెక్ డ్యాం

తనుగుల చెక్ డ్యాం కుంగుబాటు ఘటనను ప్రధాన పార్టీలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ ఆయా పార్టీల నేతలు ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇసుక మాఫియాను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నేతల పనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ నాణ్యతాలోపం వల్లే అంటూ BJP నేతలు ఆరోపిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పటి ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణాలు చేసిందంటూ ఇటు CONG ఆరోపిస్తోంది.
News November 27, 2025
BREAKING.. కాళోజీ ఎగ్జామినేషన్ గది సీజ్!

డబ్బులు తీసుకొని <<18400179>>మార్కులు కలిపిన<<>> ఉదంతంపై చర్యలు చేపట్టారు. వరంగల్ ఎమ్మార్వో శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్యా ఎగ్జామినేషన్ బ్రాంచ్ గదిని, కంప్యూటర్లను, స్కానర్లను సీజ్ చేశారు. నలుగురు పీజీ విద్యార్థుల రీకౌంటింగ్లో మార్కులు కలపాలని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్గా విచారణ చేపట్టింది.


