News April 10, 2025
ములుగు: UPDATE.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని హత్య

ములుగు జిల్లా వాజేడు మండలంలో <<16046948>>దారుణ హత్య జరిగిన విషయం<<>> తెలిసిందే. సీఐ కుమార్ తెలిపిన వివరాలు.. టేకులగూడెంకు చెందిన బుల్లబ్బాయి మద్యానికి డబ్బు ఇవ్వాలని తన అన్న విజయబాబును అడిగాడు. తన వద్ద లేవని చెప్పడంతో కోపంతో పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేసి హత మార్చాడు. విజయబాబు చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News April 21, 2025
భూ సమస్యల కోసమే భూభారతి: ASF కలెక్టర్

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. KZR మండలం వంజీరి రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, అంశాలపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. భూభారతి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రికార్డులలో ఏదైనా తప్పుల సవరణకు తహశీల్దార్ కార్యాలయంలో సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఈనెల 24న RCBతో జరిగే మ్యాచుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని, జట్టుతో బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్‌లోని హోమ్ బేస్‌లో ఉంటారని RR ధ్రువీకరించింది. భవిష్యత్తు మ్యాచుల్లో ఆడతారా? లేదా? అన్నది సంజూ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
News April 21, 2025
ప.గో: పోలీస్ శాఖ పీజీ ఆర్ఎస్‌కు 23 అర్జీలు

ప.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌కు 23 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.