News December 19, 2024
ముళ్ళ పందులను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు
నిర్మల్లోని కొండాపూర్ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా మూడు చనిపోయిన ముళ్ల పందులు లభించినట్లు నిర్మల్ ఎఫ్ఆర్వో రామకృష్ణారావు తెలిపారు. ముళ్లపందులను దిలావర్పూర్ అటవీ ప్రాంతంలో చంపి నిర్మల్కు చెందిన విజయ్, నాగరాజు విక్రయించడానికి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బైకును జప్తు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచమన్నారు.
Similar News
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.
News February 5, 2025
ADB: రైలు పట్టాలపై పడి మృతి
తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.