News November 2, 2024
ముషీరాబాద్‌లో 2 వేల కిలోల దున్నరాజు

ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.
Similar News
News January 4, 2026
FLASH.. హైదరాబాద్ శివారులో మహిళపై అత్యాచారం

ఇబ్రహీంపట్నం పరిధి యాచారం మండలంలో దారుణం చోటుచేసుకుంది. తమ్మలోనిగూడలోని కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మహిళపై సూపర్వైజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సూపర్వైజర్‌గా పనిచేస్తున్న నందివనపర్తికి చెందిన సాయి సదరు కూలీ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపారు.
News January 4, 2026
HYDలో రెండు రోజుల్లో 327 మందిపై కేసులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. జనవరి 2, 3న చేపట్టిన తనిఖీల్లో మొత్తం 327 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిలో 263 మంది బైకర్లు, 25 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News January 4, 2026
GHMCలో పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత..?

GHMC పరిధిలో ఆస్తి పన్ను మదింపు అధికారుల అధికారాలపై స్పష్టత వచ్చింది. 10 వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న భవనాల పన్ను వ్యవహారాలను డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. అంతకు మించి విస్తీర్ణం ఉన్నా లేదా ఐదేళ్ల కంటే పాత బకాయిల సర్దుబాటు చేయాలన్నా నేరుగా జోనల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. చిన్నచిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ చేస్తారు కానీ పెద్ద ప్రాపర్టీల లెక్కలన్నీ జోనల్ స్థాయిలోనే తేలనున్నాయి.


