News February 20, 2025
ముషీరాబాద్: కళావిహీనంగా గాంధీ విగ్రహం.!

గాంధీ హాస్పిటల్ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. అలాంటి ఆసుపత్రిముందునెలకొల్పిన గాంధీవిగ్రహానికి రిపబ్లిక్ డే సందర్భంగా వేసిన పూలమాల, గద్దే చుట్టూ అలంకరించినపూలు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నిత్యం వేలమందివచ్చే ఈ చారిత్రక దవాఖానా ప్రధానగేట్ ముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర ఆసుపత్రుల పరిస్థితిని అర్థంచేసుకోవచ్చని అక్కడి స్థానికులు అంటున్నారు.
Similar News
News March 17, 2025
HYD: అమెరికాలో యాక్సిడెంట్.. BRS నేత కూతురి మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.
News March 17, 2025
రాజేంద్రనగర్ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT
News March 17, 2025
HYD: ఓయూ బంద్‌కు ABVP పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్‌మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.