News September 30, 2024
ముషీరాబాద్: కుల, మతాంతర వివాహలు చట్టబద్ధమే

కుల మతాంతర వివాహాలు రాజ్యాంగబద్ధమేనని ప్రభుత్వం పౌర సమాజం అభ్యుదయ వివాహాలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు కేవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ అధ్యక్షత వహించారు.
Similar News
News October 25, 2025
సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు..!

రాబోయే పండుగలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 28, నవంబర్ 2న సికింద్రాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 30, నవంబర్ 4వ తేదీల్లో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రావడానికి అవకాశం కల్పిస్తున్నట్లు CPRO శ్రీధర్ పేర్కొన్నారు.
News October 25, 2025
HYD: ఉస్మానియా అండర్ గ్రౌండ్లో మార్చురీ నిర్మాణం

HYD గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఉన్నతాధికారుల బృందం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉస్మానియా నూతన ఆసుపత్రికి సంబంధించి పలు డిజైన్లను మార్చిన అధికారులు, భూగర్భంలో మార్చురీ నిర్మించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ప్రైమరీ ప్లానింగ్ రిపోర్టులో పేర్కొన్నారు.
News October 25, 2025
HYD: NIMSలో రూ.2,500కే డయాలసిస్..!

HYD పంజాగుట్ట పరిధిలోని NIMS హాస్పిటల్లో అధునాతన డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఉచితం కాగా మిగతా వారికి తక్కువ ఖర్చులోనే అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 5 షిఫ్టుల్లో దాదాపు 1,000 మందికి డయాలసిస్ చేస్తున్నారు. సుమారు 120 డయాలసిస్ యంత్రాలు అందుబాటులో ఉండగా, ఆరోగ్యశ్రీ లేనివారికి రూ.2,500కే డయాలసిస్ చేస్తున్నారు.


