News February 26, 2026
ముసునూరు: అత్యాచార కేసులో మూడేళ్ల జైలు శిక్ష

ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన దోమతోటి సుధాకర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మచిలీపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2018లో ఓ దివ్యాంగ మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు ఈ శిక్ష ఖరారు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించారు.
Similar News
News April 15, 2026
పోలాస రిపోర్ట్.. మండనున్న ఉత్తర తెలంగాణ

జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (AMFU), పొలాస ఉత్తర తెలంగాణకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 15–19 మధ్య ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 45°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని టెక్నికల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి తెలిపారు.

ఉమ్మడి KNR జిల్లాలో మరింత పెరిగిన ఎండ తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత మరింత పెరిగింది. మంగళవారం జగిత్యాల జిల్లా రాఘవపేట, ఐలాపూర్‌లో అత్యధికంగా 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా ఇందుర్తి 42.8, ఏదులగట్టెపల్లిలో 42.5℃, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి 42.7, రామగుండం 42.5℃ నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, మర్రిగడ్డలో 42.8℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.