News March 18, 2024
ముస్తాబాద్లో కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతి
కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్లు, పొల్స్ విరిగిపడ్డాయి. ఎలుసాని ఎల్లయ్య (50) అనే వ్యక్తి కరెంట్ పోల్ పక్కనే ఉన్నాడు. భారీ ఈదురుగాలికి పోల్ విరిగి మెడపై పడింది. దీంతో అతని మెడపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News January 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.70,412 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,348, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,890, అన్నదానం రూ.12,174 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 8, 2025
కొండగట్టులో ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు
మల్యాల మండలంలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి తెలిపారు. తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించి తర్వాత అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వివరించారు.
News January 8, 2025
HYDలో సిరిసిల్ల యువకుడి సూసైడ్
HYD కొంపల్లిలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శ్రీగాధ మనోహర్(25) HYDలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఉరేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరిలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.