News March 13, 2025
ముస్తాబాద్: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

ముస్తాబాద్ మండలం పోతుగల్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. రోజువారి విధులలో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గీతాంజలి, అనిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
నాగుల చవితి రోజున చదవాల్సిన మంత్రాలు

నాగుల చవితి రోజున ‘ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్’ శ్లోకాన్ని జపిస్తే.. భక్తులు ముక్తిని, మోక్షాన్ని, నాగరాజు ఆశీస్సులను పొందుతారని పండితులు చెబుతున్నారు. పుట్టలో పాలు పోసేటప్పుడు ‘సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే.. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ శ్లోకాన్ని పఠిస్తే.. సర్పాలు సంతృప్తి చెందుతాయని నమ్మకం.
News October 25, 2025
సిరిసిల్ల: అత్యధికంగా ముస్తాబాద్‌లో..

జిల్లాలోని ముస్తాబాద్‌లో అత్యధికంగా 19.5, అత్యల్పంగా వేములవాడ రూరల్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇల్లంతకుంట 13.8, ఎల్లారెడ్డిపేట 13.3, రుద్రంగి 9.5, ఇల్లంతకుంట 5.5, కోనరావుపేట 5.3, సిరిసిల్ల 3.5, చందుర్తి 3.5, వేములవాడ 3.3, గంభీరావుపేట 2.3, తంగళ్ళపల్లి 2, బోయినపల్లిలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 25, 2025
నిర్మల్: ఈనెల 26 వరకు గడువు పొడగింపు

అంతర్-జిల్లా డిప్యుటేషన్ కోసం దరఖాస్తు గడువును ఎడిట్ ఆప్షన్‌తో సహా ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు 25 నుంచి 26వ తేదీ లోపు ఎడిట్ చేసి సమర్పించవచ్చని అలాగే కొత్తగా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


