News March 13, 2025

ముస్తాబాద్: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్వో

image

ముస్తాబాద్ మండలం పోతుగల్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. రోజువారి విధులలో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గీతాంజలి, అనిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 12, 2026

సిద్దిపేట: 10వ తరగతి మొదటి మైలురాయి: DEO

image

విద్యార్థి జీవితంలో 10వ తరగతి మొదటి మైలురాయని, దానిని ఏకాగ్రతతో అధిగమించాలని DEO శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం విపంచి కళానిలయంలో 10 విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువును ఇష్టపడి చదివితే కష్టం కాదన్నారు. ఈ విద్యా సంవత్సరం 10 పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. బిస్మాట్ స్టేట్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి ఉన్నారు.

News February 12, 2026

GNT: 21న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

image

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు వెల్లడించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 12, 2026

చిత్తూరు: YCP కమిటీ నియామకాల విడుదల

image

చిత్తూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ సెక్రటరీగా పుంగనూరు కమతంపల్లికి చెందిన కొమ్మిరి కుమార్, డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఈశ్వర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.