News February 10, 2025
ముస్తాబాద్: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

ముస్తాబాద్ మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి నామాపూర్, మొర్రపూర్, సేవాలాల్ గ్రామాలలో దాడులు నిర్వహించగా 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in
News December 1, 2025
పార్లమెంట్ సమావేశాలు.. బండి సంజయ్ గొంతెత్తుతారా? లేదా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. KNR పార్లమెంట్ స్థానానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడంపై బండి సంజయ్ మాట్లాడితే BJPకి ఎంతోకొంత మేలు జరగనుంది. ఇక జిల్లాలో ఇసుక మాఫియా వల్ల చెక్ డ్యాంలకు జరుగుతున్న నష్టం, కూల్చివేత అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అంతా కోరుతున్నారు.
News December 1, 2025
కృష్ణా: పార్లమెంట్లో గర్జించి.. సమస్యలు పరిష్కరించండి సార్.!

విజయవాడ మెట్రో, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కేంద్రం అనుమతులు, నిధులు అత్యవసరం. పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, అమృత్, జల్ జీవన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి. కృష్ణా నదిపై చౌడవరం, మోపిదేవి వద్ద రెండు బ్యారేజీలు, బుడమేరు శాశ్వత పరిష్కారానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలి. ఈ సమస్యలపై ఎంపీలు చిన్ని, బాలశౌరి పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


