News February 1, 2025
ముస్తాబాద్: గూడు లేక.. రాత్రంతా అంబులెన్సులోనే మృతదేహం

ముస్తాబాద్కి చెందిన బిట్ల సంతోష్ (48) అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు అభ్యర్థించారు.
Similar News
News October 18, 2025
నర్వ: నీటి సంపులో పడి చిన్నారి మృతి

నర్వ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 18 నెలల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. శివరాం, పావనిల కూతురు రాజేశ్వరి (18 నెలలు)ని నానమ్మ పక్కన కూర్చోబెట్టి గడ్డి తొలగిస్తుండగా, ఇంటి పక్కన ఉన్న సంపులో రాజేశ్వరి పడింది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించకపోవటంతో వెతికారు. సుమారు గంట తర్వాత సంపులో చిన్నారి మృతిచెంది కనిపించటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
News October 18, 2025
కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్న్యూస్

‘X’ అధినేత ఎలాన్ మస్క్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్న్యూస్ చెప్పారు. తమ ఫీడ్ రికమెండేషన్ అల్గారిథమ్ను మార్చబోతున్నట్లు తెలిపారు. ‘6 వారాల్లో ఫీడ్ రికమెండేషన్ Grok AIకు అప్పగిస్తాం. అది ప్రతి పోస్టు, రోజుకు 100మి+ వీడియోలు చూస్తుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ను రికమెండ్ చేస్తుంది’ అని తెలిపారు. అంటే పేజ్, ఫాలోవర్లతో సంబంధం లేదు. మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే అది ఆటోమేటిక్గా వైరలయ్యే ఛాన్సుంటుంది.
News October 18, 2025
అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ మరణం
1968: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
1991: భారత మాజీ క్రికెటర్ జయదేవ్ ఉనడ్కట్ జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ(ఫొటోలో) మరణం