News February 1, 2025
ముస్తాబాద్: గూడు లేక.. రాత్రంతా అంబులెన్సులోనే మృతదేహం

ముస్తాబాద్‌కి చెందిన బిట్ల సంతోష్ (48) అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు అభ్యర్థించారు.
Similar News
News February 19, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

TG: పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కేసు దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ (మార్చి 3) వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News February 19, 2025
VZM: పెండింగ్ చలానాలు చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న ఈ చలనాలను వాహనదారులు చెల్లించే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ చలనాలు విధించినప్పటికీ చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ చలానాలు చెల్లించే వరకు వాహనాలు సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
News February 19, 2025
రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క

రేపు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని, ఈ సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని అన్నారు.