News February 21, 2025

ముస్తాబాద్: మంటల్లో చిక్కుకొని మహిళ మృతి

image

మంటలో చిక్కుకొని మహిళ మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలం అవునూరులో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్ని అంజవ్వ శుక్రవారం ఉదయం ఇంటిముందు చెత్తకు నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల్లో చిక్కుకొని మృతిచెందింది. అంజవ్వకు భర్త బాల్రెడ్డి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

NCSSRలో ఉద్యోగాలు

image

స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (<>NCSSR<<>>) 7 పోస్టులను భర్తీ చేస్తోంది. డిగ్రీ, పీజీ (న్యూట్రీషన్&డైటెటిక్స్/ఫుడ్ సైన్స్& న్యూట్రిషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఈ నెల 15, 16తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.28,000+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 3, 2025

పాలమూరు: నేడు ఉపసంహరణ, గుర్తు కేటాయింపు

image

పాలమూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదైందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమానుసారం గుర్తుల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.

News December 3, 2025

కరీంనగర్: అభ్యర్థులకు గుర్తులు కేటాయించేది నేడే

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో నేడు అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది. కాగా, ఇవాళే పంచాయతీలవారీగా బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయిస్తారు. దీంతో అభ్యర్థులు గుర్తులతో ప్రచారం చేసుకోవచ్చు. మరోవైపు రెండో విడత నామినేషన్ల పరిశీలన కొనసాగుతుండగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియా నడుస్తోంది.