News February 3, 2025
ముస్తాబాద్: వైన్స్ పర్మిట్ రూమ్లో వ్యక్తి హఠన్మారణం

ముస్తాబాద్లోని కొత్త బస్టాండ్ సమీపంలోని వైన్ షాపు పర్మిట్ రూమ్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నామాపూర్కు చెందిన తేపూరి నారాయణ(50) ఆదివారం రోజంతా పనిచేసి రాత్రి అక్కడే పర్మిట్ రూంలోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచాక పర్మిట్ రూంలోనే హఠాత్తుగా కిందపడి చనిపోయాడు. మృతునికి అతిగా మద్యంతాగే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 7, 2025
నైట్ షిఫ్ట్ ఒత్తిడి తట్టుకోలేక 10 మందిని చంపేసిన నర్సు!

నైట్ షిఫ్టులతో విసుగు చెందిన ఓ నర్సు (Male) హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి 10 మందిని చంపిన ఘటన జర్మనీలోని వుయెర్సెలెన్ ఆసుపత్రిలో జరిగింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు మరో 27 మందిని హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా గతంలో నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా 85 మందిని హత్య చేశాడు.
News November 7, 2025
కొత్తగూడెం: సింగరేణి డిపెండెంట్లకు శుభవార్త

ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కృషితో సింగరేణి కారుణ్య నియామక అభ్యర్థులకు శుభవార్త అందింది. మెడికల్ టెస్టులు పూర్తయి ఇప్పటివరకు నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది డిపెండెంట్లకు ఈ నెల 12న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. దీని ద్వారా సింగరేణి వ్యాప్తంగా 473 కార్మిక కుటుంబాలకు న్యాయం జరగనుంది.


