News April 8, 2025
ముస్తాబాద్: 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో మొత్తం జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
నారాయణపేట జిల్లాలో 6 తనిఖీ కేంద్రాల ఏర్పాటు

కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. జలాల్ పూర్, కాన్కూర్తి, చెగుంట, కృష్ణ నది బ్రిడ్జి, సమస్త పూర్, ఉజ్జెల్లి గ్రామాల వద్ద 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను 24 గంటలు పోలీసులు తనిఖీ చేస్తారని, రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఉంటారన్నారు.
News April 20, 2025
రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని MBNR కలెక్టర్ ఆగ్రహం

ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా అంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్ మండలం వెన్నచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. వేసవిలో కేంద్రాలకు వచ్చే రైతులకు నీడ, తాగునీరైనా కల్పించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
News April 20, 2025
కాంగ్రెస్‌ది చేతకాని పాలనకు నిదర్శనం: శ్రీనివాస్ గౌడ్

మద్యం ధరలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పరిశ్రమలు ఏర్పాటుచేసి పెట్టుబడులు రాబట్టాలి గాని మద్యం రేట్లు పెంచి ఆదాయాన్ని అర్జించాలనే ప్రభుత్వ ధోరణి చేతకాని పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.