News January 28, 2025

ముస్తాబైన కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం

image

ప్రతి సంవత్సరం మాఘపు అమవాస్య సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర బుధవారం నుంచి అంగరంగ వైభవంగా మొదలవనుంది. ఈ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతర 5 రోజులు సాగనుంది. ఈ జాతరకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకోవాలని ప్రధానార్చకుడు సాకేత్ శర్మ తెలిపారు.

Similar News

News November 28, 2025

HYD: నిర్మాణ భవనానికి జలమండలి నీళ్లు?

image

సాధారణంగా జలమండలి గృహ అవసరాల కోసం మాత్రమే మంచినీటిని సరఫరా చేస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనాలకు, ఖాళీ స్థలాల్లో చేసే నిర్మాణాలకు జలమండలి నీటిని సరఫరా చేయదు. కానీ బంజారాహిల్స్ రోడ్ నం.13లో నిర్మాణంలో ఉన్న స్థలానికి నిత్యం జలమండలి నీటిని సరఫరా చేస్తుందంటూ స్థానికులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. జలమండలి ఉన్నతాధికారుల స్పందించి దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 28, 2025

హనుమకొండ రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశం వాయిదా

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS), హనుమకొండ జిల్లా శాఖకు సంబంధించిన ముఖ్యమైన సర్వ సభ్య సమావేశం వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల కారణంగా, సంస్థ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, డిసెంబర్ 3, 2025 (బుధవారం)న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, సర్వ సభ్య సమావేశం డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామంది.

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు.. త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 ఖాళీలు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.