News January 28, 2025

ముస్తాబైన కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం

image

ప్రతి సంవత్సరం మాఘపు అమవాస్య సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర బుధవారం నుంచి అంగరంగ వైభవంగా మొదలవనుంది. ఈ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతర 5 రోజులు సాగనుంది. ఈ జాతరకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకోవాలని ప్రధానార్చకుడు సాకేత్ శర్మ తెలిపారు.

Similar News

News February 8, 2025

బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి: KMR కలెక్టర్

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

News February 8, 2025

ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్

image

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

News February 8, 2025

ఖట్టర్ ఇమాందార్.. ఇమేజ్ ఖతం!

image

లూజు ప్యాంటు. పొడవు చొక్కా. జేబులో రెనాల్డ్స్ పెన్ను. తలకు మఫ్లర్. పర్ఫెక్టుగా డిజైన్ చేసుకున్న సామాన్యుడి ఇమేజ్. ప్రజల డబ్బుకు ఖట్టర్ ఇమాందార్‌గా ఉంటానని ప్రతిజ్ఞ. అవినీతి రహిత రాజకీయాలు చేస్తానన్న హామీతో వరుసగా 3సార్లు గెలుపు. కట్‌చేస్తే శీశ్‌మహల్లో గోల్డ్ ప్లేటెడ్ కమోడ్. వేగనార్ పోయి బెంజ్ వచ్చే. లిక్కర్, వాటర్ స్కాములు. అవినీతి ఆరోపణలు. జైల్లోనూ పదవిపై వ్యామోహం. కళంకిత ఇమేజ్‌తో AKకు శరాఘాతం!

error: Content is protected !!