News January 26, 2025

ముస్తాబైన వనపర్తి కలెక్టరేట్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబ్ చేశారు. నేడు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆవిష్కరించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ 7:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఆర్వోలకు శిక్షణ

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రతి ఆర్‌ఓ వ్యవహరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నామినేషన్ల దాఖలు నుంచి లెక్కింపు వరకు అప్రమతంగా ఉండాలన్నారు.

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.

News December 1, 2025

నిర్మల్: డీఎడ్ పరీక్షకు 83 మంది హాజరు

image

నిర్మల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో జరుగుచున్న డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు 93 మంది విద్యార్థులకు గాను 83 మంది విద్యార్థులు హాజరుకాగా పదిమంది గైరాజరయ్యారని డీఈవో భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే సత్యనారాయణ రెడ్డి, నిర్మల్ ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సందర్శించారు.