News April 3, 2025

ముస్లింలకు ఉచిత విద్య: అబ్దుల్ అజీజ్

image

నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభవార్త చెప్పారు. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు త్వరలో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పథకం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలకు ఆమోదం తెలిపారు. 

Similar News

News April 6, 2025

శ్రీరాముని ఆదర్శాలతో వివక్షలు లేని సమాజం: వెంకయ్య 

image

సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న వివక్ష, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాచలం(మ) శ్రీరామపురం రామాలయంలో జరిగిన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో అయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీరాముడు ఆదర్శం కావాలని, ప్రతి గ్రామంలోనూ రామాయణ పారాయణం జరగాలన్నారు.

News April 6, 2025

నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

image

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

News April 5, 2025

ప్రతి ఇంట్లో వ్యాపారవేత్త ఉండాలి : నెల్లూరు మంత్రి

image

2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన మెప్మా వన్ డే వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే మెప్మా లక్ష్యమని తెలిపారు. ఈ వర్క్ షాపులో నారాయణతో పాటు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.

error: Content is protected !!