News May 12, 2024

మూడవ రాండమైజేషన్ పూర్తి: మన్యం జిల్లా కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి మూడవ రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్ మెహర్డ సమక్షంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సీల్డు కవర్‌లో పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Similar News

News March 9, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 8, 2026

VZM: అండర్-13, 18 క్రీడాకారుణులకు పరుగు పందెం పోటీలు

image

మహిళా దినోత్సవం సందర్భంగా మై భారత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం బాబామెట్టలోని విజ్జీ స్టేడియంలో జరిగాయి. అండర్-13, 18 18 ఏళ్లు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు.