News June 24, 2024

మూడునాలుగు రోజుల్లో పిఠాపురానికి పవన్ రాక

image

మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఆదివారం ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పట్టణ శివారులోని ఇల్లింద్రాడ వద్ద ఓ రైస్‌మిల్లులో సమావేశమయ్యారు. పవన్ పిఠాపురం ప్రజలను కలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారని తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా, 5 శాఖల బాధ్యతలు ఆయనపై ఉన్నాయని, వాటికి న్యాయం చేస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు.

Similar News

News September 18, 2025

కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.

News September 18, 2025

నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

News September 18, 2025

రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

image

తూ.గో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.