News April 3, 2025
మూడు నెలల్లో రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

మారుమూల గిరిజన గ్రామాలకు ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో మంజూరు చేసిన రహదారుల నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్, పీఐయూ, గిరిజన సంక్షేమ శాఖలకు రోడ్డు నిర్మాణాలకు పంపిన ప్రతిపాదనలు పరిశీలించి రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు.
Similar News
News April 11, 2025
దండేపల్లి: గోదావరిలో స్నానానికి వెళ్లి బాలుడి మృతి

దండేపల్లి మండలం గూడెం గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముత్తె శివవర్మ (7) అనే బాలుడు మృతి చెందాడని దండేపల్లి ఎస్సై తౌసుద్దీన్ తెలిపారు. గురువారం సాయంత్రం శివవర్మ హనుమాన్ స్వాములతో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడన్నారు. శివవర్మ దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముత్తే భీమయ్య కుమారుడని ఎస్సై వివరించారు.
News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

పిడుగుపాటుకు కొండాపూర్‌లో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగారానికి చెందిన సంతోష్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో సదాశివపేట మండల పరిధిలోని ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 11, 2025
సంగారెడ్డి: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహిర్ మండలంలో జరిగింది. కోహీర్ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాలు.. మండలంలోని కొత్తూరు ‘కె’ గ్రామానికి చెందిన మానెప్ప (58) గత కొంతకాలంగా కడుపునొప్పి, ఎదలో నొప్పితో బాధపడుతూ గురువారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అనుషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.