News July 8, 2024

మూడు పంచాయతీలుగా భద్రాచలం పంచాయతీ

image

భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.

Similar News

News December 1, 2024

భద్రాద్రి: పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల ను పరిష్కరించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం కలెక్టర్ ధరణి దరఖాస్తులపై జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. అన్ని మాడ్యూల్స్‌లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.

News November 30, 2024

KMM: రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం: మంత్రి తుమ్మల

image

పదేళ్ల BRS పాలనలో ఛిన్నాభిన్నమైన తెలంగాణను CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. MBNRసభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఆగమైందని, ఏడాదిగా బాగు చేస్తున్నామని తెలిపారు. ‘అన్నా.. కష్టాలున్నా.. అప్పులున్నా.. కడుపు కట్టుకోనైనా సరే రైతు రుణమాఫీ చేద్దామని’ సీఎం అన్నారని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు.

News November 30, 2024

KMM: BRS వాళ్ల లాగా గాలి మాటలు మేం చెప్పం: భట్టి

image

వివిధ కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము గాలి మాటలు చెప్పేటోళ్లం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రుణమాఫీ సక్రమంగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.