News March 11, 2025
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని సచివాలయాలలో చేపడుతున్న వివిధ రకాల సర్వే ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వివిధ అంశము లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ రకాల సర్వేలలో ఎ.యన్.యంలు తప్ప మిగిలిన సచివాలయ సిబ్బందిని సర్వే ప్రక్రియలలో వినియోగించుకొని త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు.
Similar News
News January 16, 2026
కర్నూలు: ‘యువకుడి మృతి.. గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ సమీపంలో ఇవాళ సాయంత్రం బైక్ ఢీకొనడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 ఏళ్లు ఉంటాయి. ఎడమ చేతి మణికట్టుపై ॐ, GP పచ్చబొట్లు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ 9121101063 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు కోరారు.
News January 16, 2026
మాడుగుల: రెండు రోజుల తర్వాత మృతదేహం తరలింపు

మాడుగుల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ రత్నకుమారి కేజీహెచ్‌లో చి<<18874616>>కిత్స పొందుతూ మృతి చెందగా <<>>అంబులెన్స్ అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి రత్నకుమారి మృతదేహాన్ని మాడుగుల సమీపంలోని గిరిజన ప్రాంతానికి తరలించారు. ఆ కుటుంబం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు
News January 16, 2026
ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్‌పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.


