News December 29, 2024

మూడు రోజుల పాటు ‘అరకు చలి’ ఉత్సవాలు

image

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ‘అరకు చలి’ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో శనివారం పాడేరు ఐటిడిఏ పీఓ అభిషేక్, జేసీ అభిషేక్ గౌడ్ అరకులోయ వచ్చి స్థల పరిశీలన చేసి, ఉత్సవాల విజయవంతానికి ప్రణాళికను రూపొందించారు. దేశంలో ఉన్న గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ తెలిపారు.

Similar News

News January 4, 2025

ఉమ్మడి విశాఖలో పలువురికి పదోన్నతులు

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2025

స్టీల్ ప్లాంట్: మోసానికి పాల్పడిన తండ్రి-కొడుకులకు జైలు శిక్ష

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో తండ్రి-కొడుకులకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి పోతయ్య ఆయన కుమారుడు వెంకటరమణ ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. బాధితులు 2017లో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News January 4, 2025

విశాఖ: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 8న ప్రధాని విశాఖలో పర్యటించి అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.