News June 4, 2024
మూడు లక్షలు దాటిన శ్రీభరత్ ఆధిక్యత

విశాఖపట్నం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీ భరత్ భారీ ఆధిక్యతతో దూసుకు వెళుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు 5,60,792 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీలక్ష్మికి 2,54,739 ఓట్లు లభించాయి. దీనితో శ్రీభరత్ 3,60,53 ఓట్ల భారీ మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యా రెడ్డికి 18956 ఓట్లు లభించి 3వ స్థానంలో ఉన్నారు.
Similar News
News November 14, 2025
మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్‌ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
News November 14, 2025
ఆల్పాహార విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్.. సీఎం చంద్రబాబు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటుగవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఉన్నారు.
News November 14, 2025
విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాలో రాధాకృష్ణన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి చేరుకొని సదస్సును ప్రారంభించనున్నారు.


