News November 10, 2024

మూడో రోజు ఘనంగా ప్రారంభమైన లక్ష దీపోత్సవం

image

నెల్లూరు నగరంలోని VRC మైదానం వేదికగా నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆదివారం విశేష చండీ హోమం, 501 మంది దంపతులచే సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Similar News

News December 14, 2024

నెల్లూరు: కోడిగుడ్డు ధర రూ.10? 

image

నెల్లూరు జిల్లాలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర పలు ప్రాంతాల్లో రూ.7.50కు చేరింది. వారం రోజుల క్రితం వరకు ఈ ధర రూ.5 నుంచి రూ.6 వరకు ఉండేది. వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గుడ్డు ధరలకు రెక్కలు వచ్చినట్లు స్థానికులు వాపోయారు. మరిన్ని రోజుల్లో ఈ ధర రూ.10కు చేరొచ్చని వ్యాపారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.  

News December 14, 2024

నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు

image

నేడు నెల్లూరు జిల్లాలోని 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, 490 వాటర్ యూజర్ అసోసియేషన్లు, 3,698 టీసీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2.95లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలకు 9,120 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.

News December 13, 2024

నెల్లూరు: రేపు పాఠశాలలకు సెలవు రద్దు

image

రేపు రెండో శనివారం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.బాలాజీ రావు తెలిపారు. అక్టోబర్ నెలలో వర్షాల వలన సెలవులు ఇచ్చినందున ఈ నిర్ణయం జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరంలో 220 పని రోజులు కచ్చితంగా పాఠశాలలు పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు.