News January 25, 2025

మూడో స్థానంలో కృష్ణా జిల్లా

image

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.

Similar News

News January 27, 2025

దేవాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

image

కృష్ణా జిల్లాలోని ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ గంగాధర్ రావు అధికారులకు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎస్పీ సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. 

News January 27, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ చంద్రశేఖరరావులు కూడా అర్జీలు స్వీకరించారు. 

News January 27, 2025

గుడివాడ: కొత్త ఆటోలో తీసుకెళ్లి ప్రాణం కాపాడాడు..!

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడిన ఆటో డ్రైవర్ కందుల శ్యామ్‌కు ఏలూరు కలెక్టర్ రూ.5వేలు, ప్రాణ దాత అవార్డు అందజేశారు. లింగాల గ్రామానికి చెందిన కాటి నిరీక్షణ బాబు కానుకొల్లు వద్ద నవంబరు 28న బైకుపై వెళ్తూ అదుపుతప్పి కిందిపడిపోయాడు. అటుగా ఫ్యామిలీతో కొత్త ఆటోలో వస్తున్న కందుల శ్యామ్, నల్లగుడ్ల రాజు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాబును గుడివాడ ఆసుపత్రిలో చేర్చారు.