News August 18, 2024

మూసాపేట్: చికెన్ తీసుకురాలేదని వైన్స్‌లో గొడవ

image

ఆర్డర్ చేసిన చికెన్ తీసుకురాలేదని కస్టమర్లకు, యజమానికి మధ్య గొడవ జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సంకలమద్ది గ్రామానికి చెందిన నలుగురు యువకులు మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో చికెన్ ఆర్డర్ చేశారు. డ్రింక్ పూర్తయ్యే వరకు చికెన్ రాకపోవడంతో సీసా పగలగొట్టి గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలిపారు.

Similar News

News September 13, 2024

సిపిఎం నేత లక్ష్మీదేవమ్మ కన్నుమూత

image

ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. మరి జిల్లా సిపిఎం పార్టీలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకురాలు లక్ష్మీదేవమ్మ(70) మరణించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాల్లో లక్ష్మీ దేవమ్మ చురుకుగా పాల్గొన్నారు. మహిళ ఉద్యమాల నిర్మాణంలోనూ లక్ష్మీ దేవమ్మ చురుకైన పాత్ర పోషించారు. లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల సిపిఎం నాయకులు సంతాపం తెలిపారు.

News September 13, 2024

అలంపూర్: చాలాకాలం తరువాత గుర్తించారు..!

image

అలంపురంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో ఉన్న ద్వారపాలకుల విగ్రహానికి ఈఓ పురేందర్ కుమార్ రంగులు వేయిస్తున్నారు. 60ఏళ్ల క్రితం కళ్ళే రంగస్వామి(కుంటి రంగస్వామి)అనే స్థానిక కళాకారుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలను స్వయంగా చేశారు. మంచి రూపలావణ్యం కలిగిన విగ్రహాలను భక్తులు గుర్తించలేకపోతున్నారంటూ ఈవో వాటికి పేయింటింగ్ చేయించారు. ఇంతకాలానికి గుర్తించినందుకు ధన్యవాదాలంటూ కళ్లె వంశీయులు రంగ అన్నారు.

News September 13, 2024

MBNR: కుల,మత సామరస్యతకు వారు నిదర్శనం

image

కుల,మత సామరస్యతకు ప్రతీకగా, భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైంది. చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను గ్రామ ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్‌లు వేలం పాటలో పాల్గొని రూ.15వేలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.