News November 3, 2024

మూసి నిర్వాసితులకు 2BHK..చకచకా పనులు

image

మూసి నిర్వాసితులకు అంబర్పేట, హిమాయత్ నగర్ ముసారం బాగ్, కేసీఆర్ నగర్ పరిధిలో కొందరికి ఇప్పటికే 2BHK ఇండ్లను పట్టాలిచ్చి ఖాళీ చేయించారు. మరోవైపు పిల్లిగుడిసెల కాలనీ, ప్రతాప సింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు, గాంధీనగర్, జై భవాని నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, పోచంపల్లి బాచుపల్లి ఇలా మొత్తం దాదాపు 14 ప్రాంతాలకు మూసి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధం చేశారు.

Similar News

News December 6, 2024

HYD: యూనివర్సిటీల అభివృద్ధిపై ఫోకస్

image

HYD యూనివర్సిటీల అభివృద్ధిపై విద్యా కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మౌలిక వసతుల కల్పన, ఖాళీల భర్తీ, పరిశోధనలు, అభివృద్ధి, ఆచార్యులు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, ప్రభుత్వ బకాయిలను గుర్తించడంపై పంచసూత్ర ప్రణాళిక రూపొందించింది. ఉస్మానియా, జేఎన్టీయూ లాంటి అనేక యూనివర్సిటీలను అభివృద్ధి చేయనున్నారు.

News December 6, 2024

HYD: తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ప్రత్యేకతలు ఇవే.!

image

HYD తార్నాకలోని రాష్ట్ర ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగులందరికీ ఆరోగ్య సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో 15 డిస్పెన్సరీలు ఉన్నట్లు తెలిపింది. 24/7 ఫార్మా, ఫిజియోథెరపీ, ఐసీయూ, CT, MRI, ఆపరేషన్ థియేటర్, ల్యాబోరేటరీ, కాలేజీ, నర్సింగ్ ల్యాబ్, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు కాకుండా మిగతా వారికి సైతం నామమాత్రపు ఫీజుతో OP సేవలు అందిస్తారు.

News December 6, 2024

HYD: పుష్ప-2.. భార్యగా, తల్లిగా రేవతి GREAT

image

పుష్ప-2 ప్రీమియర్‌షోకు వెళ్లిన రేవతి కుటుంబంలో <<14796361>>విషాదం<<>> మిగిలిన విషయం తెలిసిందే. తనకు 2023లో కాలేయం ఇచ్చి పునర్జన్మనిచ్చిన భార్య లేదనే బాధ కలచివేస్తుందని ఆమె భర్త భాస్కర్ కంటతడిపెట్టిన ఘటన పలువురిని కదిపేసింది. కుమారుడు బన్నీకి వీరాభిమాని అని, ఫస్ట్ షో చూపించమని మారాం చేయడంతో సంధ్య థియేటర్‌కు వెళ్లామని వాపోయారు. క్రౌడ్‌లో కింద పడిపోయిన బాలుడిని పైకిలేపే క్రమంలో తల్లి తీవ్రంగా గాయపడిందని వాపోయారు.