News April 3, 2025
మూసీకి పూడిక ముప్పు..!

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.
Similar News
News December 27, 2025
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీసు

నల్గొండ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించింది. నల్గొండ నుంచి ప్రతి రోజు ఉదయం 6.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని ఆర్టీసీ డీపో మేనేజర్ ఎంవీ రమణ శనివారం తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సు స్థానంలో డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 27, 2025
జిల్లాలో 4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దగ్గర పడ్డాయి. ఇప్పటివరకు 4.86 లక్షల మెట్రిక్ పనుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 392 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 85,175 మంది రైతుల నుంచి రూ.1158 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో రైతులకు ఇప్పటివరకు రూ.1078 కోట్లు చెల్లించారు. సాగర్, దేవరకొండ నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.
News December 27, 2025
నల్గొండ జిల్లాలో ముమ్మరంగా నట్టల నివారణ కార్యక్రమం

నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 78 బృందాలుగా ఏర్పడిన 250 మంది సిబ్బంది గ్రామగ్రామాన జీవాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం31వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం లక్ష్యం పూర్తయిందని, గొర్రె కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారులు సూచించారు.


