News August 24, 2024
మృతుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి మృతుడి భార్య సాయి దుర్గకు చెక్కు అందజేశారు.
Similar News
News November 21, 2025
తూ.గో: ‘రాజమౌళికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసులు నమోదు చేయడం బీజేపీ అసహనానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజమండ్రిలో తెలిపారు. తక్షణమే ఈ అర్థరహితమైన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
News November 20, 2025
మల్లవరం పంచాయతీకి రాష్ట్రంలో ద్వితీయ స్థానం

శానిటేషన్ IVRS కాలింగ్లో చాగల్లు మండలం మల్లవరం పంచాయతీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీదేవి గురువారం ప్రకటించారు. పబ్లిక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, ఇంటింటికీ చెత్త సేకరణకు 100 శాతం, కనీసం వారానికి రెండుసార్లు సేకరణకు 92 శాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కమలావతిని ఎంపీడీవో సన్మానించారు.
News November 19, 2025
ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.


