News August 24, 2024
మృతుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి మృతుడి భార్య సాయి దుర్గకు చెక్కు అందజేశారు.
Similar News
News September 14, 2024
కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.
News September 14, 2024
ఉమ్మడి తూ.గో. జడ్పీ ఇన్‌ఛార్జి CEOగా పాఠంశెట్టి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.
News September 14, 2024
రాజమండ్రి: 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి
రాజమండ్రి పరిధి హుకుంపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బొమ్మూరు CI కాశీ విశ్వనాథం శుక్రవారం తెలిపారు. వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్టాప్‌లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.