News January 26, 2025
మృతులు రాయచోటి వాసులుగా గుర్తింపు

బి.కొత్తకోట మండలం కనికలతోపు వద్ద ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఫయాజ్(30), సిబ్బాలకు చెందిన మహీంద్ర(28)గా గుర్తించినట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని టీ కోసం రోడ్డు పక్కన నిలపగా.. కోళ్ల లోడుతో కదిరి నుంచి రాయచోటి వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు.
Similar News
News December 3, 2025
నవంబర్ అంటే నాకు భయం: రామ్

నవంబర్ అంటే తనకు భయమని హీరో రామ్ అన్నారు. గతంలో ఇదే నెల రిలీజైన ‘మసాలా’కు కలెక్షన్లు రాలేదని చెప్పారు. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై ఉన్న నమ్మకంతోనే ఆ భయాన్ని పక్కనపెట్టినట్లు వివరించారు. ఇది గొప్ప సినిమా అని ప్రేక్షకులు వెంటనే తెలుసుకుంటారా? లేట్ అవుతుందా? అనే దానిపై చర్చించుకున్నట్లు చెప్పారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా డే-1లోనే కలెక్షన్లు కొట్టేస్తుందని అనుకోలేదని థ్యాంక్స్ మీట్లో తెలిపారు.
News December 3, 2025
ఏపీలో సమగ్ర క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక చర్యలు: MP సానా

ఏపీలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎంపీ సానా సతీష్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో క్యాన్సర్ పై మాట్లాడరని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయుష్ శాఖ మంత్రి క్యాన్సర్ నివారక చికిత్సలు వాటికి సంబంధించి ఏపీలో జరుగుతున్న విధానాన్ని తెలియజేశారని కార్యాలయం వెల్లడించింది. ఆయుష్కు ఆధునిక వైద్యాన్ని ముడిపెట్టి చికిత్సలు అందిస్తారన్నారు.
News December 3, 2025
VKB: లైన్ మెన్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష: ఎస్పీ

కరెంట్ షాక్తో యువకుని మృతికి కారణమైన విద్యుత్ శాఖ లైన్మెన్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా జడ్జి శ్రీనివాస్ రెడ్డి శిక్ష ఖరారు చేశారు. 2020లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవరంపల్లిలో లైన్మెన్ అబ్దుల్ జలీల్, ఎల్సీ (Line Clear) తీసుకోకుండా నిర్లక్ష్యంగా కుషా రెడ్డిని కరెంట్ పోల్పైకి ఎక్కించి మృతికి కారణమవడంతో ఈ శిక్ష పడినట్లు ఎస్పీ తెలిపారు.


