News July 11, 2024
మృత్యు వారధిగా మారిన చించినాడ బ్రిడ్జి

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.
News November 23, 2025
ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 23, 2025
ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: జేసీ

అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లే అవుట్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. రెండు రోజులుగా అప్డేట్ చేయాల్సిన యాప్ను ఇప్పటికే జిల్లాలోనీ పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాలలో డేటా ఎంట్రీని మొదలుపెట్టడం జరిగిందన్నారు.


