News March 15, 2025
మెగాస్టార్ చిరంజీవికి అవార్డు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్ఠాత్మక “లైఫ్ టైం అచీవ్ మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్”పురస్కారాన్ని ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు. సినిమా హీరోగా లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని మెగాస్టార్ గా కీర్తించబడుతున్న చిరంజీవి బ్లడ్,ఐ బ్యాంకులు నెలకొల్పి విశేష సేవలందిస్తున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News March 15, 2025
ఖమ్మం: భార్యతో గొడవ.. భర్తను అప్పగించిన పోలీసులు

భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లగా మధిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఖమ్మం 3టౌన్‌కు చెందిన D.శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం తన భార్యతో గొడవపడి, ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. శుక్రవారం మధిరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News March 15, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ఒంటిపూట బడులు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మాదారం అంకమ్మ తల్లి జాతర ప్రారంభం ∆} జూలూరుపాడులో రాందాస్ నాయక్ పర్యటన ∆} ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.