News January 30, 2025
మెట్‌పల్లిలో గాంధీకి నివాళులు

మెట్‌పల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, మెట్‌పల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్‌గా విద్యాసాగర్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ కన్వీనర్‌గా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. LMDలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విద్యాసాగర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విద్యాసాగర్ తెలిపారు.
News September 16, 2025
వెలిచాలలో మహిళా డిగ్రీ కళాశాల NSS క్యాంప్

రామడుగు మండలం వెలిచాలలో మహిళా డిగ్రీ కళాశాల NSS క్యాంప్ 6వ రోజుకు చేరింది. మంగళవారం NSS ఆఫీసర్ డా. ఈ.స్రవంతి ఆధ్వర్యంలో NSS వాలంటీర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. స్కూల్ విద్యార్థులలో క్రమశిక్షణ కార్యక్రమాలు, గ్రామంలో సర్వే నిర్వహించారు. అనంతరం KNR సైబర్ క్రైమ్ వారు హాజరై ఆన్లైన్ మోసాలను మహిళల భద్రతను గురించి వివరించారు.
News September 16, 2025
KNR: శిశు సంరక్షణ కేంద్రాల పరిశీలన

కరీంనగర్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని వాకాడే పరిశీలించారు. లోకల్ బాడీస్ జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమె కమిటీ సభ్యులతో కలిసి ఈ కేంద్రాలను సందర్శించారు. వెంకట్ ఫౌండేషన్ బాల గోకులం, సంక్షేమ ట్రస్ట్ కపిల్ కుటీర్, ఓపెన్ షెల్టర్లలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు.