News March 8, 2025
మెట్‌పల్లి: ఆరోగ్య సమస్యలతోనే నవవరుడు ఆత్మహత్య

మెట్‌పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామం రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే<<15688708>> నవ వరుడు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా తమకు చెప్పలేదని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది
Similar News
News December 9, 2025
టెట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: రెవెన్యూ అధికారి

జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో టెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
News December 9, 2025
క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.


