News July 25, 2024
మెట్పల్లి: ఒక్క రోజే నాలుగు డెంగ్యూ కేసులు
మెట్పల్లి పట్టణంలో ఒక్క రోజే నలుగురికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వారికి మెట్పల్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ టి.మోహన్‌తో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వో పేషెంట్ల ఇళ్లకు వెళ్లి శానిటేషన్ చేయించారు. ఇద్దరి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Similar News
News October 7, 2024
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
హుస్నాబాద్: EWS రిజర్వేషన్ల వల్ల SC, ST, BC విద్యార్థులకు DSCలో తీవ్ర అన్యాయం జరిగిందని BC సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు పిడిశెట్టి రాజు అన్నారు. సమాజంలో 6 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
News October 7, 2024
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.
News October 7, 2024
కరీంనగర్: గునుగు పూలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు ఆదివారం ఉదయం గునుగు పూలు తేవడానికి వెళ్లాడు. పూలను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు.