News August 16, 2024
మెట్పల్లి కిడ్నాప్ కేసులో బయటకొస్తున్న మరికొన్ని విషయాలు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు నిందితుడి విచారణలో సంచలన విషయాలు బయట పడ్డాయి. నిందితుడు నాగేశ్, అతని భార్య లావణ్య 3 నెలల్లో ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి ఇద్దరిని ఈ ఏడాది జూన్‌లో అమ్మినట్లు తేలింది. జూన్‌లో ఆరేళ్ల పాపతో పాటు మూడేళ్ల పాపను కిడ్నాప్ చేసి ఒకరిని రూ.2 లక్షలకు, మరొకరిని రూ.1.50 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారనే విషయాలు తెలియాలి.
Similar News
News September 17, 2024
నిమజ్జన ప్రాంతాలను పర్యవేక్షించిన KNR కలెక్టర్
మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంటలో గణేశ్ నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం రాత్రి పరిశీలించారు. ఇప్పటివరకు నిమజ్జనం అయిన విగ్రహాల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు.
News September 17, 2024
కరీంనగర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించి తర్వాత జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
News September 17, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,53,203 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.78,346, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,200, అన్నదానం రూ.24,657,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.