News August 11, 2024
మెట్పల్లి: గురుకులంలో బయటపడుతున్న పాములు

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల ఆవరణలో ముళ్లపొదలు, శిథిల భవనాలను కూల్చివేయడం, మురికి కుంటను పూడ్చే క్రమంలో పాములు బయటకు వస్తున్నాయి. శనివారం కొన్ని పాములు బయటకు రాగా అందులో నాలుగింటిని చంపేశారు. ఇంకా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాములు కనిపిస్తుండటంతో విద్యార్థులు పాము కాటుతోనే ప్రమాదానికి గురయ్యారని భావిస్తున్నారు.
Similar News
News November 2, 2025
తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
News November 2, 2025
KNR: ‘రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు సీఈఓ లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్వోలతో రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పాల్గొన్నారు.
News November 2, 2025
KNR: పీఎఫ్, డిపాజిట్లపై అవగాహన ముఖ్యం: కమిషనర్

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ కేవైసీ, ఫోన్ నంబర్, అడ్రస్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.


