News April 15, 2025

మెట్‌పల్లి: ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

image

మెట్‌పల్లి శివారులో రేగుంట – అమ్మక్క పేట రోడ్డులో మంగళవారం వేకువజామున ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా..  మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి  మెట్‌పల్లికి చెందిన జక్కం భూమేశ్(32)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 30, 2025

మెదక్: రేపు బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్

image

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31న మెదక్‌లోని PNR స్టేడియంలో ‘ఓపెన్ టు ఆల్’, 40+ వయసు విభాగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆర్ఎస్సై నరేష్ (87126 57954) వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News October 30, 2025

అభ్యంగ స్నానంతో ఎన్నో ప్రయోజనాలు

image

వారానికోసారి అభ్యంగన స్నానం చేయాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. తైలాభ్యంగం ముఖ్యమని చెబుతోంది. స్పర్శేంద్రియమైన చర్మంలోనే ఈ శరీరం ఉంటుంది. అందువల్ల నూనె లేపనం శరీరానికి బలం, కాంతిని ఇస్తుంది. శిరస్సు నందు అభ్యంగనం వల్ల ఇంద్రియాలు తృప్తి చెందుతాయి. దృష్టి దోషాలు తొలగి, శిరో రోగాలు నశిస్తాయి. అవయవాలకు బలం చేకూరుతుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

News October 30, 2025

ఇంటర్వ్యూతో IRCTCలో 64 ఉద్యోగాలు

image

IRCTC 64 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్& క్యాటరింగ్ సైన్స్), MBA(టూరిజం& హోటల్ మేనేజ్‌మెంట్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ వివిధ ప్రాంతాల్లో నవంబర్ 8 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com