News February 26, 2026
మెట్‌పల్లి: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష సందర్భంగా గురువారం మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 18, 2026
నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
News April 18, 2026
బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.
News April 18, 2026
KNR: నేడు ఎలగందల్ కోటలో ఉచిత ప్రవేశం

కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల్ కోటను సందర్శించాలని భావిస్తున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేడు కోటను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని కోటను సందర్శించుకోవాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. ఎలగందల్ కోట తన వైభవమైన చరిత్ర, అద్భుత నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందింది.


