News April 2, 2025
మెట్పల్లి : పసుపు క్వింటాల్ @14,669

మెట్పల్లి మార్కెట్లో నేటి పసుపు భారీగా పెరిగాయి. నేడు పసుపు కాడి గరిష్ఠ రూ. 14,669, కనిష్ఠ రూ. 9,099; పసుపు గోళం గరిష్ఠ రూ. 13,695, కనిష్ఠ రూ. 9,000; పసుపు చూర గరిష్ఠ రూ. 12,911, కనిష్ఠ రూ. 9,033 లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. ఈ రోజు మొత్తం 1769 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. కాగా ఈ సీజన్ ప్రారంభంలో పసుపు క్వింటాల్ గరిష్ఠ ధరలు రూ.10-11వేలుగా పలికాయి.
Similar News
News October 20, 2025
బాపట్లలో నేడు PGRS రద్దు: కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈనెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.
News October 20, 2025
GNT: ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా.?

ఆ రోజులలోని దీపావళి ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉండటం లేదు. 7 రోజుల ముందు నుంచే రీల్స్ గన్స్ పేల్చుకుంటూ జేమ్స్ బాండ్లా ఫీల్ అయ్యేవాళ్లం. పండుగ రోజున నాన్నతో టపాసులు కొనుక్కొని డాబాపై ఎండబెట్టి, నాగుల చవితి కోసం కొన్ని దాచుకోని, సాయంత్రం క్రాకర్స్ కాల్చుకునేవాళ్లం. రాత్రికి ఇంటిబయట కాగితాలు బట్టి.. ఎవరు ఎక్కువ కాల్చారో ఫ్రెండ్స్తో డిస్కషన్తో పండుగ ముగిసేది. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే COMMENT చేయండి.
News October 20, 2025
TODAY HEADLINES

➣ రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలకు CM CBN గ్రీన్ సిగ్నల్
➣ సిడ్నీలో మంత్రి లోకేశ్.. తెలుగువారితో భేటీ
➣ BJP, BRS కలిసి కుట్ర చేస్తున్నాయి: CM రేవంత్
➣ మావోయిస్టులతో రాజకీయ నేతలు సంబంధాలు తెంచుకోవాలి: బండి సంజయ్
➣ JEE మెయిన్-2026 షెడ్యూల్ విడుదల
➣ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో, ఉమెన్స్ WCలో ఇంగ్లండ్తో మ్యాచులో భారత్ ఓటమి