News February 1, 2025
మెట్పల్లి: ‘పసుపు పలికిందిలా’..

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శనివారం పసుపు కాడి క్వింటాల్ కనిష్ఠ ధర రూ.7,000, గరిష్ఠ ధర రూ.12,666, పసుపు గోల ధర రూ.7,000, గరిష్ఠ ధర రూ.10,666, పసుపు చూర కనిష్ఠ ధర రూ.9,566, గరిష్ఠ ధర రూ.10,122గా పలికాయని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
జగిత్యాల: గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు పరిశీలించిన ఎస్పీ

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 6 మంది అర్జీదారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ప్రతి ఫిర్యాదుపై మర్యాదపూర్వకంగా స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలనతో వేగంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు.
News November 24, 2025
గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.
News November 24, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆయన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 57 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.


