News February 1, 2025

మెట్‌పల్లి: ‘పసుపు పలికిందిలా’..

image

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శనివారం పసుపు కాడి క్వింటాల్ కనిష్ఠ ధర రూ.7,000, గరిష్ఠ ధర రూ.12,666, పసుపు గోల ధర రూ.7,000, గరిష్ఠ ధర రూ.10,666, పసుపు చూర కనిష్ఠ ధర రూ.9,566, గరిష్ఠ ధర రూ.10,122గా పలికాయని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2025

నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.

News February 16, 2025

బాల్కొండ: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

image

బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణ(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆర్మూర్‌కు తరలించారు.

News February 16, 2025

మెదక్: రేపటి నుంచి ఆర్థిక సర్వేకు అవకాశం: కలెక్టర్

image

ఈ నెల 16 నుంచి 28 వరకు సామాజిక, ఆర్టిక, విద్య, ఉపాది, రాజకీయ కుల సర్వే లో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టోల్ ఫ్రీ, ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసి సమర్పించడం ద్వారా పాల్గొనవచ్చన్నారు. శనివారం జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ పాల్గొన్నారు.

error: Content is protected !!